ETV Bharat / state

ఇది తెలుసా... కాగితాలతో కరోనా రాదు..

author img

By

Published : Dec 18, 2020, 6:46 AM IST

పది నెలల కిందట దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఇటీవలే కాస్త ఉపశమించినా, ముప్పు పూర్తిగా తొలగిపోనందున అప్రమత్తత కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘వైరస్‌ వ్యాప్తిపై అపోహల నివారణ, స్వీయ రక్షణ చర్యలపై నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం

corona
ఇది తెలుసా... కాగితాలతో కరోనా రాదు..

పాల ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు....ఒకటేమిటి ఇలా ఏ వస్తువు ఇంటికి తెచ్చుకున్నా గంటలకొద్దీ నీళ్లలో నానబెట్టడం.. రసాయనాలతో కడగడం ద్వారా కరోనా వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తపడుతున్నామనే భావనలో కొందరున్నారు. అట్టపెట్టెల్లో వచ్చే పార్శిళ్లను గంటల తరబడి ఎండలోపెట్టి, రసాయనాల్లో ముంచితే తప్ప ఇంట్లోకి తీసుకెళ్లని వారూ ఉన్నారు. ఇదే సమయంలో కొందరు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించకపోవడం, యథేచ్ఛగా గుంపుల్లో తిరగడం వంటివి చేస్తున్నారు. ఏదైనా కొత్త వస్తువు లేదా ఉపరితలాలను ముట్టుకున్న సందర్భాల్లో చేతులు శుభ్రపర్చుకోవాలనే కనీస కొవిడ్‌ నిబంధననూ పాటించడం లేదు. మహమ్మారి మన మధ్యకు వచ్చి దాదాపు 10 నెలలు గడిచినా, వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుంది? వేటి ద్వారా వ్యాపించదు? ఏ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చు? తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కొరవడటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని సెంటర్‌ డీసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ), ఐసీఎంఆర్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు వాస్తవాలను వెల్లడిస్తున్నప్పటికీ కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారంతో ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారని అభిప్రాయడుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తిపై వాస్తవాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని, అనవసర భయాందోళనలకు గురికావద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. సూక్ష్మ రంధ్రాలతో పొరలుపొరలుగా ఉండే కాగితాలు, అట్టపెట్టెలు, దుస్తుల ఉపరితలాలపై వైరస్‌ ఎక్కువ కాలం జీవించదని చెబుతున్నారు.

కాగితాలతో వ్యాప్తి అపోహే..

-డాక్టర్‌ ఎంవీరావు, జనరల్‌ ఫిజీషియన్‌

తి సూక్ష్మ రంధ్రాలతో పొరలుపొరలుగా ఉండే వస్తువుల ఉపరితలాలపై వైరస్‌ ఎక్కువ కాలం జీవించదు. ఉదాహరణకు కాగితాలు, వార్తా పత్రికలు, అట్టపెట్టెలు, లేఖలు, టిష్యూ పేపర్లు, ఆహార పొట్లాలు తదితరాల ద్వారా వ్యాప్తి చెందినట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక్క కేసూ నమోదు కాలేదు. ఏ వైద్య పరిశోధనల్లోనూ నిర్ధారణ కాలేదు. ఆహార పదార్థాల ద్వారానూ సోకదు. బయటి నుంచి ఆహార పదార్థాలు వచ్చినప్పుడు మాత్రం పైకవర్‌ను తొలగించి, చేతులను శుభ్రంచేసుకొని తినాలి. కూరగాయలు, పండ్లను సాధారణ నీటిలో శుభ్రం చేస్తే చాలు. వాటిని రసాయనాల్లో శుభ్రపర్చడం ద్వారా విషతుల్యాలు శరీరం లోపలికి వెళ్లే ప్రమాదముంది.

సూదులతో వ్యాపించదు

- డాక్టర్‌ శుభాకర్‌, శ్వాసకోశ నిపుణులు

వైరస్‌ వ్యాప్తిపై శాస్త్రీయత ముఖ్యం. గర్భిణికి వైరస్‌ సోకినా, ప్రసవ సమయంలో తల్లి నుంచి శిశువుకు వచ్చే అవకాశాలు తక్కువే. పాలు ఇచ్చేటప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా తల్లి శిశువును తాకినా, మాస్కు ధరించకుండా దగ్గినా, తుమ్మినా ఆ తుంపర్లు శిశువుపై పడి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. వైరస్‌ సోకిన వ్యక్తికి ఇచ్చిన సూదిని, మరొకరికి ఇచ్చినా వ్యాప్తి ఉండదు. వస్త్రాల నుంచి కూడా కొవిడ్‌ వ్యాప్తి చెందదు.

మాస్కులే రక్ష

-డాక్టర్‌ కె.రాంబాబు, ఏపీ కొవిడ్‌-19 నోడల్‌ ఆఫీసర్‌

వైరస్‌ వెలుగులోకి వచ్చిన ఏడాది తర్వాత గతంలో జరిగిన ప్రచారాల్లో ఎక్కువ శాతం అపోహలేనని తేలిపోయింది. ఉదాహరణకు వస్తువులు, కరెన్సీ నోట్లు, పత్రికలు పట్టుకోవడం ద్వారా వైరస్‌ సోకిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. లాక్‌డౌన్‌ తర్వాత నగదు లావాదేవీలు భారీగా సాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కాగితాల వినియోగం సాధారణంగానే ఉంది. ఒకవేళ కాగితాల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశమే ఉంటే.. కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగేది. మాస్కులు ధరించకపోవడం వల్లనే వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటోంది.

కొవిడ్‌ వ్యాప్తి ఇలా..

  • కరోనా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, పెద్దగా నవ్వినా, గట్టిగా అరిచిన సందర్భాల్లో వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఆ సమయంలో సదరు వ్యక్తికి ఆరు అడుగుల దూరంలో మాస్కు ధరించకుండా ఉన్న వారికి వైరస్‌ సోకే అవకాశం ఉంటుంది.
  • చలి వాతావరణంలో, గాలి అటూ ఇటూ కదిలేందుకు వీల్లేని గదుల్లో, వెలుతురు ప్రసరించని ప్రదేశాల్లో, ఎయిర్‌కండిషనర్‌ ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది.
  • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు దళసరి, గట్టి వస్తువులపై పడినప్పుడు.. వాటి ఉపరితలాలపై వైరస్‌ ఎక్కువసేపు జీవిస్తుంది. ఆ ప్రదేశాన్ని ఎవరైనా చేతితో తాకి, వెంటనే అదే చేత్తో ముక్కు, నోరు, కళ్లను స్పృశిస్తే అది వ్యాప్తి చెందుతుంది. ఉదాహరణకు బల్లలు, స్టీలు, మందంగా ఉండే ప్లాస్టిక్‌ వస్తువులు, గోడలు, స్నానాల గదుల తాలూకూ గొళ్లేలు, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ల కీబోర్డులు, సెల్‌ఫోన్‌ల ఉపరితలాలు తదితరాలు.

ఇవీ చూడండి: పీఎస్‌ఎల్‌వీ-సీ50 ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.