సహకార సంఘాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడురోజులపాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం 905 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 11,765 డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈనెల 9న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు జరగనుంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాలను అదే రోజు సాయంత్రం వెల్లడించనున్నారు.
ఇవీ చూడండి:సహకార ఎన్నికల్లో 14 లక్షల ఓట్ల తొలగింపు