కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమకు శిక్షణ తరగతులు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ఏఆర్, సివిల్ అభ్యర్థులకు ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ అభ్యర్థులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నారని... తమకు శిక్షణ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో ఎంపికైన తమకు... ఇప్పటివరకు శిక్షణ ఇవ్వకుండా జాప్యం చేయడమేంటని ప్రశ్నించారు. త్వరలోనే శిక్షణ ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని డీజీపీ కార్యాలయం లోపలికి పంపించారు. చర్చల అనంతరం పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన హామీతో అభ్యర్థులు ఆందోళన విరమించారు.
డీజీపీ కార్యాలయం ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా - డీజీపీ కార్యాలయం ముందు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా
12:28 August 25
ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా