Congress Senior Leaders Nominated Posts : అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పార్టీ అధికారపగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం లాబీయింగ్‌ను ముమ్మరం చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఎమ్మెల్యేలుగా ఎవరు గెలవకపోవడంతో ఇక్కడి నుంచి ఒకరిద్దరికి ఎమ్మెల్సీ పదవులతోపాటు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోటీ చేసి ఓటమి చెందిన వారు టికెట్లు దక్కని నాయకులు, టికెట్లు అడగని సీనియర్ నాయకులు కూడా ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. టికెట్ దక్కని వారిని బుజ్జగించే తరుణంలో సర్దుబాట్లు చేసేందుకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు ఏఐసీసీ, పీసీసీ నుంచి చాలా మందికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కించుకునేందకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Congress Leaders Nominated Posts : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు రెండు, ఎమ్మెల్యే కోటా కింద ఒకటి చొప్పున మూడు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. వీటితో పాటు వందకు పైగా వివిధ శాఖల్లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండేందుకు వీలుగా మైనార్టీ నాయకుడికి ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలన్న యోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన పలువురు మైనారిటీ నాయకులు దిల్లీలో మకాం వేశారు.
nominated posts in Congress : అయితే ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికి ఏడాది పాటు ఎలాంటి పదవులు ఇవ్వరాదన్న అధిష్ఠానం నిర్ణయంతో ఏం చేయాలో చాలా మంది నాయకులకు పాలు పోవడం లేదు. అయినప్పటికీ ఓటమి చెందిన ముగ్గురు మైనారిటీ నాయకులు దిల్లీలో అగ్రనేతల చుట్టూ ప్రదక్షణలు చేసినట్లు తెలుస్తోంది. కొందరు హైదరాబాద్ వచ్చేయగా మరికొందరు అక్కడే మకాం వేశారు. అదే విధంగా మాజీ ఎంపీ, ఇటీవల హైదరాబాద్ నగరంలో పోటీ చేసి ఓటమి చెందిన నాయకుడు కూడా దిల్లీలో అగ్రనాయకులను కలుస్తూ ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి నగర శివారు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చేసినట్లయితే పార్టీని బలోపేతం చేస్తానని చెబుతున్నట్లు సమాచారం. మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కూడా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ : సీఎం రేవంత్ రెడ్డి
వందకుపైగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కోసం ఎవరెవరు పని చేశారు? క్షేత్రస్థాయిలో ఉంటూ పార్టీ గెలుపుకోసం కృషి చేసిన వారెవరు? ఇలా వివిధ అంశాల ఆధారంగా పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నడుం బిగించింది. ఈ నెల 18వ తేదీన పార్టీ రాష్ట్ర నాయకత్వం సమావేశం ఏర్పాటు చేయనుంది. శాసన సభ సమావేశాలు ముగియనుండడంతో ఇవాళ రాత్రి లేదా, రేపు రేవంత్ దిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఫార్మా సిటీ రద్దు చేయడం రంగారెడ్డి జిల్లా వాసులకు పండగ : మల్‌రెడ్డి రంగారెడ్డి
గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లుగా ఉంది : కడియం శ్రీహరి