ETV Bharat / state

Congress Screening Committee Meeting Today : గెలుపు గుర్రాల ఎంపికపై కాంగ్రెస్ తర్జనభర్జన.. అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం..!

Congress Screening Committee Meeting Today : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిన అభ్యర్థుల ప్రకటనపై.. కాంగ్రెస్‌ పార్టీ తర్జనభర్జన పడుతోంది. ఇవాళ్టి స్క్రీనింగ్‌ కమిటీలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా.. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాతనే.. అభ్యర్థుల ప్రకటన ఉంటుందని హస్తం వర్గాలు వెల్లడిస్తున్నాయి. బస్సు యాత్ర తేదీలు, అందులో పాల్గొననున్న పార్టీ అగ్రనేతల వివరాలు ఈరోజు అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్ర మూలంగా అభ్యర్థుల ప్రకటన కొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.

Congress screening committee
Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 7:09 AM IST

Congress Screening Committee Meeting Today గెలుపు గుర్రాల ఎంపికపై కాంగ్రెస్ తర్జనభర్జన అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం

Congress Screening Committee Meeting Today : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. స్క్రీనింగ్‌ కమిటీలో (Congress Screening Committee) పాల్గొంటున్న కొందరు నాయకుల తీరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరు నేతలు.. ఆశావహులకు సమాచారం ఇస్తుండడంతో.. రహస్యంగా జరగాల్సిన వ్యవహారం బహిర్గతం అవుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాల తర్వాత.. ఒకరిద్దరు నాయకులు సమావేశంలో జరిగిన విషయాలను బయటకు చెప్పడం, కొందరు ఆశావహులకు అందులో పాల్గొన్న వారు మద్దతు ఇవ్వలేదని తెలియజేయడంతో.. ఆశావహుల నుంచి నాయకులపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.

Congress Flash Survey Telangana : ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక మీద మరో లెక్క.. టెన్షన్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు

Competition For Telangana Congress Tickets : స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌ (Muralidharan) కేరళ ఎంపీ కావడంతో.. కొందరు ఆశావహులైతే ఏకంగా కేరళకు వెళ్లి అక్కడ వారి సామాజిక వర్గానికి చెందిన లేక తెలంగాణ పార్టీ నాయకులకు దగ్గరగా ఉన్న నేతల ద్వారా.. మురళీధరన్‌పై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అనుబంధ విభాగానికి చెందిన ఓ ఛైర్మన్‌.. తనకు టికెట్‌ కోసం దిల్లీలో నాలుగైదు రోజులు మకాం వేసినా.. తను చేసిన లాబీయింగ్‌ ఫలించలేదు. దీంతో ఏకంగా కేరళ వెళ్లి అక్కడ తమ అనుబంధ విభాగానికి చెందిన జాతీయ నాయకుడి ద్వారా మురళీధరన్‌కు చెప్పించుకున్నట్లు సమాచారం.

ఇలా ఎవరికి వారు ఆశావహులు పైరవీలు చేసుకునే పనిలో మునిగి తేలడంతో.. గోప్యంగా జరగాల్సిన అంశాలు బహిర్గతం కావడం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో రాహుల్‌ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో లాబీయింగ్‌లకు కానీ, ఒత్తిళ్లకు కానీ తలొగ్గొద్దని గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కేట్లు చూడాలని మురళీధరన్‌కు.. రాహుల్ దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్​పై ఏఐసీసీ ఫైర్

Telangana Assembly Elections 2023 : స్క్రీనింగ్‌ కమిటీపై ఒత్తిడి పెరగడం, ముందు జరిగిన సర్వేలపై అనుమానాలు వ్యక్తం కావడం వల్ల.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కొత్త ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలకు తావులేకుండా ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వకుండా.. సరికొత్త విధానంలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో అందరూ కూర్చొని.. చర్చించుకుని అభ్యర్థుల ఎంపికపై వాళ్ల వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేసే విధానం ఉండేది. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా మార్పు తెచ్చినట్లు విశ్వసనీయంగా సమాచారం.

సభ్యులు తెలియజేసిన అభిప్రాయాలు.. బయటకు తెలియకుండా ఉండేందుకు ఒక్కొక్కరిని పిలిపించుకుని అభిప్రాయాలను తీసుకుని.. వాటిని అప్పటికప్పుడు రికార్డు చేసుకునేట్లు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌, ఇద్దరు సభ్యులు.. రాష్ట్రానికి చెందిన సభ్యులను ఒక్కొక్కరిని పిలిపించుకుని నియోజకవర్గాల వారీగా.. జాబితాలో ఉన్న నాయకులకు చెందిన వారి అభిప్రాయం తీసుకుంటారు.

Congress MLA Tickets in Telangana 2023 : దీంతో ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలిసే అవకాశం ఉండకపోవడంతో.. విషయాలు బయటకు పొక్కే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు దిల్లీలో జరగనున్న స్క్రీనింగ్‌ కమిటీ సమావేశానికి.. ఛైర్మన్‌ మురళీధరన్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

అదేవిధంగా అనుమానాలు వ్యక్తమైన అసెంబ్లీ నియోజక వర్గాలపై.. తిరిగి పకడ్బందీగా సర్వేలను పార్టీ అధిష్ఠానం చేయించింది. వాస్తవానికి మురళీధరన్‌ కమిటీకి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై సంపూర్ణమైన అవగాహనకు వచ్చి ఉండడంతో.. కొత్తగా వచ్చిన సర్వేలను దగ్గర ఉంచుకుని స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు చెప్పిన అభిప్రాయాలను.. పరిగణనలోకి తీసుకుని మెరుగైన, గెలుపు గుర్రాలు అభ్యర్థులుగా బరిలో దించనున్నారు.

TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad : "కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది"

వాస్తవానికి ఇవాళ్టి స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం తర్వాత.. వీలైనంత త్వరగా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ప్రకటనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ మారిన పరిస్థితులు కారణంగా స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినా.. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తుది ప్రక్రియ పూర్తి చేసినా.. అభ్యర్థుల ప్రకటన మాత్రం జాప్యం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Congress Bus Yatra 2023 : ప్రధానంగా రాష్ట్రంలో ఈ నెల 14, 15 తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాహుల్‌, ప్రియాంక గాంధీల్లో ఎవరో ఒకరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటారు. అదేవిధంగా రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఈ నెల 18 నుంచి రెండు, మూడు రోజులు తెలంగాణాలోనే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకు నాలుగైదు అసెంబ్లీ నియోజక వర్గాలు కవర్ అయ్యేట్లు రూట్ మ్యాప్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్‌ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్‌, షెడ్యూల్‌

హైదరాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆరు, ఏడు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సగమైనా కలిసొచ్చేట్లు రూట్‌ మ్యాప్‌ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలా శాసన సభ నియోజకవర్గాలను చుట్టి వచ్చేందుకు ఒక్కో రోజు ఐదారు నియోజకవర్గాలు అనుకున్నా.. 18 నుంచి 20 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని రోజులు బస్సు టూర్‌ నిర్వహించినట్లయితే అభ్యర్థుల ప్రకటన మరింత జాప్యం అవుతుందని అంచనా వేస్తున్నారు.

బస్సు టూర్‌ సమయంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లయితే.. అసమ్మతి చెలరేగి.. పార్టీ నాయకులు, కార్యకర్తలు బస్సు యాత్రకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బస్సు యాత్ర ముగిసేందుకు రెండు, మూడు రోజుల ముందు మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

Telangana Congress MLA Candidates List Delay : కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం.. అప్పటిదాకా ఆగాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.