Telangana Congress Screening Committee Meeting in Hyderabad : రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలనే అంశాలపై స్క్రీనింగ్ కమిటీలో చర్చించినట్లు కాంగ్రెస్ నేతలు(Congress Leaders) తెలిపారు. ఇంకా ఈ కమిటీలో చర్చించాల్సిన అంశాలున్నాయని.. మరోసారి సమావేశమవుతామని కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి ఠాక్రే మాట్లాడారు.
"ఈ సమావేశంలో అభ్యర్ధలు ఎంపిక కోసం పలు సూచనలు తీసుకున్నాం. మరిన్ని అంశాలను చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ భేటీ మరోసారి కొనసాగుతుంది. ఆ సమావేశంలో అభ్యర్థులను పార్టీ ప్రకటించనుంది."- మాణిక్ రావ్ ఠాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్
Congress Leaders Attend Screening Committee Meeting : పీఈసీ సభ్యులతో పాటు డీసీసీ, మాజీ మంత్రులు సీనియర్ నేతల నుంచి సలహాలు సూచనలు వచ్చాయని వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలనే అంశాలను చర్చించినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌ను చాలా మంది కలిసి తమ తమ అభిప్రాయాలు చెప్పారని.. వాటిని కూడా కమిటీ సేకరించి మొత్తం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తదుపరి సమావేశంలో నిర్ణయిస్తారని చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని భట్టి స్పష్టం చేశారు. సీడబ్ల్యుసీ సమావేశాలు ఉన్నందున అవి పూర్తయ్యే వరకు తిరిగి సమావేశమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీని తరువాత పార్లమెంటు సమావేశాలు ఉండడంతో.. అవి ముగిశాక మొదటి జాబితా ఉంటుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్‌తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), సీఈసీ సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జిగ్నేశ్ మేవాని, బాబా సిద్దిఖీ, ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, విశ్వనాత్, మన్సూర్ అలీఖాన్‌లు పాల్గొన్నారు.
"రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీకి అప్లై చేసుకున్న దరఖాస్తులు.. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో జరిగిన నాయకులు అభిప్రాయాలు.. మంగళవారం రాత్రి వరకు ముఖ్య నాయకులు ఇచ్చిన ప్రతిపాదనలు.. జిల్లా కాంగ్రెస్ కమిటీలో వచ్చిన అర్జీలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌కి ఇచ్చాం. ఈ సమాచారంతో పాటు మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉంది. వాటిని కూడా పూర్తిగా సేకరించిన తరువాత అన్నింటిని పరిశీలించి.. తదుపరి సమావేశంలో నియోజక వర్గాల వారిగా కొంత అభ్యర్థుల నిర్ణయాలు జరుగుతాయి. త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తాం. కమిటీ అధ్యక్షుడు తరవాత సమావేశం తేదీని నిర్ణయిస్తారు."- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
AICC General Secretary Venugopal Coming Hyderabad : హైదరాబాద్‌లో మొదటిసారి సీడబ్ల్యుసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియను మొదలు పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో సమీక్ష నిర్వహించి సమావేశాలు సజావుగా జరిగేందుకు ఏలాంటి చర్యలు తీసుకోవాలి, ఏఐసీసీ మార్గదర్శకాలను, దిశనిర్దేశం చేసేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హైదరాబాద్‌కి రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కొంగరకలాన్, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్, గోల్కొండ రీసార్ట్స్, ఎల్బీ స్టేడియంలను సందర్శిస్తారు. ఎక్కడ బహిరంగ సభ నిర్వహణకు అనువైన ప్రదేశం ఉంది, సమావేశం నిర్వహణకు ఎక్కడ భద్రత ఉంటుంది.. తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఆ తరువాత తాజ్ కృష్ణ చేరుకుని రాత్రి ఏడు గంటలకు నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 16, 17 తేదీల్లో జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు.
Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'
MP Komati Reddy Venkat Reddy Demand : అలిగిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. బుజ్జగించిన ఏఐసీసీ చీఫ్