ETV Bharat / state

'కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడం అరాచకం'

శ్రీశైలం ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవిని అరెస్టు చేయడం అరాచకం, అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ నాయకులు ఖండించారు. ఎంపీ, మాజీ ఎంపీలను అరెస్టు చేసి నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల పోలీసు స్టేషన్‌కు తరలించడాన్ని రాక్షస చర్యగా అభివర్ణించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా వాళ్లకు ధైర్యం కలిగించేందుకు వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు.

'కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడం అరాచకం'
'కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడం అరాచకం'
author img

By

Published : Aug 22, 2020, 6:41 PM IST

శ్రీశైలం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వద్ద ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవిని అరెస్టు చేయడం అరాచకం, అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ నాయకులు ఖండించారు. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులుగా ఘటనా స్థలాన్ని పరిశీలించడం, బాధితులను పరామర్శించడం తమ కనీస బాధ్యతని పేర్కొన్నారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమ కుమార్‌, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి, మాజీ ఎంపీ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజనీ కుమార్‌ యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లు అరెస్టులను ఖండించారు.

ఎంపీ, మాజీ ఎంపీలను అరెస్టు చేసి నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునూతల పోలీసు స్టేషన్‌కు తరలించడాన్ని రాక్షస చర్యగా అభివర్ణించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా వాళ్లకు ధైర్యం కలిగించేందుకు వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. తొమ్మిది ప్రాణాలు బలిగొన్న... ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తెరాస నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు అవకాశం ఇచ్చిన పోలీసులు ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. వెంటనే వారిని విడుదల చేసి ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు, బాధితులను పరామర్శించేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.