రాష్ట్రంలో రైతు రుణ మాఫీ తక్షణమే చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయకముందే రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, అందుకు కాంగ్రెస్ కూడా మద్దతిస్తుందని అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ, సచివాలయాల నూతన భవన నిర్మాణాలకు అంత అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి డబ్బులు లేవని చెప్పడంలో ప్రభుత్వ వైఖరి ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో రూ.66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయన్న వారు భూ ప్రక్షాళన చేపట్టాక రైతులు బజారున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : రంగు మారుతున్న 'గోదావరి'