కేసీఆర్ కమీషన్ల వల్లే పాలమూరు, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా... ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయలేదని విమర్శించారు. కృష్ణా జలాలు ఏపీ అక్రమంగా తరలిస్తుంటే స్పందించటం చేతకాని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. కరోనా విజృంభిస్తుంటే సాగర్‌లో బహిరంగ సభ పెట్టడంలో కేసీఆర్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు.
ఏపీ కుట్రపూరితంగా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలకు నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్ర చర్యలను తెరాస ప్రభుత్వం అడ్డుకోవడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం... కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతుంటే... తాజాగా మూడో టీఎంసీ లిఫ్ట్ చేయటంలో మతలబు ఏంటని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కేటీఆర్