Congress MLC Candidates 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ అధిష్ఠానం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ అధికారకంగా కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో వీరు నామినేషన్ వేయనున్నారు.
నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
Telangana MLC Notification 2024 : కాంగ్రెస్ భావిస్తున్న ముగ్గురిలో ఎవరిని పక్కన పెట్టాలనే విషయంపై చర్చ జరిగింది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఈ విషయమై చర్చిస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ అద్దంకి దయాకర్‌కు, బలమూరి వెంకట్‌లకు ఏఐసీసీ(AICC Select Congress MLC Candidates) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దం కావాలని సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆ ఇద్దరు నామినేషన్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే రేసులో మరికొందరు ఉన్నట్లు సంకేతాలు వచ్చాయి. ఫలితంగా అభ్యర్ధుల ఎంపికపై ప్రకటన రాలేదు. ఇవాళ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుని అధికారక ప్రకటన వెల్లడించింది.
ఎమ్మెల్సీ సీట్ల భర్తీపై కాంగ్రెస్ కసరత్తు - తెరపైకి ఆ ఆరుగురి నేతల పేర్లు
Telangana Congress MLC Candidates 2024 : ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్(NSUI State President Balmuri Venkat), మహేష్ కుమార్ గౌడ్‌లను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిలు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీలుగా విజయం సాధించి డిసెంబర్ 9వ తేదీన రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు ఖాళీలను ఉప ఎన్నికల ద్వారా భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నామినేషన్లు వేసేందుకు గురువారంతో గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాలను గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.
Addanki Dayakar Reaction on MLC Seats : కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ స్పందించారు. తాను కాంగ్రెస్ ప్రార్టీకి విధేయుడిగా, పార్టీ తీసుకున్ననిర్ణయాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు మరింత మంచి స్థానం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోందని తెలిపారు. దాని కోసం సహనంగా వేచి చూస్తానని స్పష్టం చేశారు. తన పట్ల కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వాలు సానుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు - ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం!