Congress MLA Candidates First List 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల (Congress Candidates) తొలి జాబితా రేపు విడుదల చేయనున్నారు. 58 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ వెల్లడించారు. మరో రెండు రోజుల్లో మిగిలిన పేర్లను ప్రకటిస్తామన్నారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి.. పార్టీకి విధేయులుగా ఉన్న నేతలను అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ నేతలు పకడ్బందీగా ప్లాన్ చేశారు. అధికారంలోకి రావడానికి పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. అభ్యర్థులపై సర్వేలు నిర్వహించి.. ప్రజల్లో వారి బలాబలాలను పరీక్షించి వారి జాబితాను సిద్ధం చేసి.. పార్టీ అధిష్ఠానానికి అందజేశారు. ఈ మేరకు రేపు 58 మందితో కూడిన తొలి జాబితా విడుదల కానుంది.
Congress Alliance With CPM CPL Parties : మరోవైపు.. కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు దాదాపు ఖరారైంది. సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు లెక్కన నాలుగు స్థానాలు ఇవ్వాలని సూత్రప్రాయంగా కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. ఏఐసీసీ నాయకులతో, వామపక్షాల జాతీయ నాయకుల (Congress Alliance) మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు సఫలమైనట్లు సమాచారం. అయితే వామపక్షాలు కోరుతున్న నాలుగు స్థానాలు కూడా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉండడం, ఆ రెండు జిల్లాల్లోనే కాంగ్రెస్ కూడా బలంగా ఉండటంతో.. సీట్ల సర్దుబాటు దగ్గర తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు కూడా రేపు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ వెల్లడించారు.
Revanth Reddy Fires on CM KCR : 'బీఆర్ఎస్ మరో 45 రోజులే.. ఆ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం'
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పాలేరు, హుస్నాబాద్, భద్రాచలం నియోజకవర్గాల్లో తమకు నాలుగు కేటాయించాలని వామపక్షాలు కోరినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గాలల్లో తమకే టికెట్లు వస్తాయని.. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు విశ్వాసంతో పని చేసుకుంటూ పోతుండడంతో.. పొత్తుల్లో ఆయా సీట్లు కేటాయించేందుకు మొదట స్థానిక నాయకత్వంతో కూడా మాట్లాడి ఒప్పించి సర్దుబాటు చేసేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. వామపక్షాల పొత్తు కొలిక్కి వస్తే.. ఆ రెండు జిల్లాల్లో అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.