మోకాలు నొప్పితో బాధపడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని శుక్రవారం పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. కొన్ని రోజులుగా మోకాలు నొప్పితో ఇంటి వద్దనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి కె.జానారెడ్డి పరామర్శించారు.
శుక్రవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, దీపక్‌జైన్, కట్ల శ్రీనివాస్, తదితరులు పరామర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ్ నివాసంలోనే కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకున్నారు.
![Congress leaders consulted the pcc chief uttam kumar reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8336207_topa.jpg)
ఇదీ చూడండి : కేరళ విమాన ప్రమాదంలో ఐదుకు చేరిన మరణాలు