పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు... ఆ పార్టీ శ్రేణులు నిరుపేదలను ఆదుకునేందుకు చురుకుగా పాల్గొంటున్నారు. పీసీసీ సేవా దళ్ కార్యదర్శి సంజయ్ సింగ్ ఆధ్వర్యంలో... హైదరాబాద్ హిమాయత్ నగర్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు నగర వ్యాప్తంగా నిరుపేదలకు తమవంతుగా వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్నట్లు వినోద్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా లాక్డౌన్కు సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: రాష్ట్రాల్లోని పరిస్థితులను గమనించాలి : కేటీఆర్