ETV Bharat / state

UTTAM: కేసీఆర్​కు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత ఉందా..? - తెలంగాణ తాజా వార్తలు

నీటి పంపకాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే ప్రస్తుతం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (uttam kumar reddy) అన్నారు. హైదరాబాద్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. సమీప భవిష్యత్తులో నాగార్జునసాగర్‌ ఆయకట్టు పూర్తి ఏడారిగా మారబోతోందని.. అందుకు సీఎం కేసీఆర్‌ కారణమవుతారని విమర్శించారు.

uttam kumar reddy
uttam kumar reddy
author img

By

Published : Jul 6, 2021, 5:22 PM IST

Updated : Jul 6, 2021, 5:45 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి (uttam kumar reddy) ఆందోళన వ్యక్తం చేశారు. గ్రావిటీ ద్వారా వచ్చే 11టీఎంసీల నీటిని తెచ్చుకోలేకపోగా... కేవలం 3టీఎంసీల నీటి కోసం లక్షా 18వేల కోట్లు వ్యయం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుంకేసుల నుంచి భారీగా నీటి తరలింపు వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో 8శాతం కమిషన్ తీసుకున్నట్లుగా ఆన్‌ రికార్డుగా చెబుతున్నానని... ఇదే అంశాన్ని పార్లమెంట్‌లో (parliament sessions) కూడా లేవనెత్తనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి (congress mp) వెల్లడించారు. సుధీర్ఘకాలం పీసీసీ అధ్యక్షుడుగా (pcc president) తనకు అవకాశం కల్పించిన ఏఐసీసీ (aicc) అధ్యక్షురాలు సోనియాగాంధీకి, రాహుల్‌ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు మధ్యాహ్నం పీసీసీ బాధ్యతలను నూతన పీసీసీ అధ్యక్షుడికి (revanth reddy) అప్పగించి పది రోజులపాటు బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలిపారు.

'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించబోతున్నా... పోతిరెడ్డుపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంపు పని మొదలు పెట్టిన తర్వాత సీఎం కేసీఆర్​కు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత ఉందా అని చెప్పి తెలంగాణ రైతులు, ప్రజలు అడుగుతున్నారు. గ్రావిటీ ద్వారా వచ్చే 11 టీఎంసీలు పోతున్నవి... నాగార్జున సాగర్​ కింద ఉన్న లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారబోతుంది.. దీనికి బాధ్యులు సీఎం కేసీఆర్​. గ్రావిటీ ద్వారా వచ్చే 11 టీఎంసీల నీటిని ఏపీ తీసుకుపోతుంటే.. మూడు టీఎంసీల కోసం లక్షా 18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ఇరిగేషన్​ ప్రాజెక్టుల్లో చాలా వృథా ఖర్చు అవుతోంది. 8శాతం కమిషన్​ ఈ ప్రభుత్వంలో పెద్దమనుషులకు అందుతుందనే విషయం కూడా ఆన్​ రికార్డ్​ ఆరోపిస్తున్నాను. ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించబోతున్నాను. ఈ ఏడున్నరేళ్లలో దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఆర్థికంగా దుర్భర పరిస్థితి తీసుకొస్తున్న విషయం కూడా పార్లమెంటులో ప్రస్తావించబోతున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ సమస్య రెట్టింపయ్యింది. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించబోతున్నాను.'

- ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎంపీ

కేసీఆర్​కు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత ఉందా..?

ఇదీ చూడండి: Bandi Sanjay : ప్రాజెక్టుల వద్ద పోలీసులను ఎందుకు పెట్టారు?

Last Updated : Jul 6, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.