ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పట్ల తండ్రిలా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. సీఎంకు మహిళల పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు లేవని ధ్వజమెత్తారు. దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేసీఆర్ నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. కులమతాలు, వయోభేదం లేకుండా దేశమంతా గగ్గోలు పెడుతుంటే కేసీఆర్ దిల్లీలో విందు కోసం వెళ్లడం ఏమిటని హనుమంతరావు ప్రశ్నించారు.
హాజీపూర్‌లో శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంత వరకు శిక్ష అమలు కాలేదని ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మెకారణంగా 30 మంది ఉద్యోగులు చనిపోయాక స్పందించి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం ఏమిటని వీహెచ్ నిలదీశారు.

ఇవీ చూడండి: దిశ హత్యాచార ఘటన మరవకముందే.. ఏపీలో మరొకటి...