పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మద్య నియంత్రణ, పురపాలక ఎన్నికలు, తెరాస హమీలు-వైఫల్యాలు తదితర అంశాలపై కోర్ కమిటీలో చర్చించారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు తొమ్మిది రోజుల పాటు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. తెరాస ఏడాది పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
భాజపా హయాంలో ధరలు పెరుగుదల, ఆర్థిక మందగమనం, పౌరసత్వ సవరణ బిల్లు తదితర అంశాలను 'భారత్ బచావో-తెలంగాణ బచావో' పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పౌరసత్వ సవరణ బిల్లును భాజపా తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న ఉదయం 10గంటలకు గాంధీభవన్‌లో జెండాఆవిష్కరణ అనంతరం... 'సేవ్ ఇండియా-సేవ్ కానిస్టిట్యూషన్' పేరుతో ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై మమత బనర్జీ, అమరేందర్ సింగ్, పినరయ్ విజయన్ తరహాలో... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అభిప్రాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ప్రైవేటుకు ధీటుగా.. సేవలు సురక్షితంగా