ETV Bharat / state

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్ - మంగళవారం బ్రేక్​ దర్శనాలు రద్దు! - TTD CANCELLED VIP BREAK DARSHAN

- తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం

TTD Cancelled VIP Break Darshan
TTD Cancelled VIP Break Darshan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 11:21 AM IST

TTD Cancelled VIP Break Darshan: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు జనవరిలో తిరుమల వెళ్తున్నారా? అయితే మీకో ముఖ్య గమనిక. ఈ నెలలో ఆ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో జనవరి 7వ తేదీ మంగళవారం నాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రగ‌నుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే జనవరి 7వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో జనవరి 6వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వివరాలు ఇవే: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా.. జనవరి 7వ తేదీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలు బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో కప్పి ఉంచుతారు.

ఆలయ శుద్ధి పూర్తైన తర్వాత సంప్రోక్షణ చేపడతారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం శ్రీవారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత.. భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - అందుబాటులోకి టీటీడీ 2025 క్యాలెండర్లు, డైరీలు - ఆన్​లైన్​లో ఇలా అప్లై చేసుకోండి!

2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో మీకు తెలుసా?

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - 10 రోజుల పాటు ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు - పూర్తి వివరాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.