ETV Bharat / state

బీఆర్ఎస్ సర్కార్ కార్యకలాపాలపై కాంగ్రెస్ ఫోకస్ - నేడు ఈసీకి ఫిర్యాదు చేయనున్న నేతలు - Congress to complain to EC against BRS government

Congress Complains EC Against BRS Government : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సానుకూలంగా ఉండడంతో తదుపరి కార్యాచరణకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ సర్కార్‌.. కార్యకలాపాలపై దృష్టి సారించింది. ఆర్థికపరమైన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కలిసి ఇవాళ ఫిర్యాదు చేయనుంది. మరోవైపు.. ఎన్నికల లెక్కింపు పూర్తై ఫలితాలు వెలువడగానే ఎమ్మెల్యేల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇవాళ ఏఐసీసీ నాయకులతో రాష్ట్ర నాయకత్వం చర్చించి ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly Election Results 2023

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 8:54 AM IST

బీఆర్ఎస్ సర్కార్ కార్యకలాపాలపై కాంగ్రెస్ ఫోకస్ నేడు ఈసీకి ఫిర్యాదు చేయనున్న నేతలు

Congress Complains EC Against BRS Government : శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ఎక్కువగా.. కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నాయి. ప్రముఖ ప్రాంతీయ, జాతీయ ఎగ్జిట్ పోల్స్‌ సంస్థలు.. తమ అంచనాల్లో దాదాపు 80 శాతం హస్తం పార్టీదే అధికారమని తేల్చాయి. ఈ తరుణంలో ప్రస్తుత రాష్ట్ర సర్కార్ కార్యకలాపాలపై.. ఆ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతో.. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదేవిధంగా అసైన్డ్‌ భూములను ధరణిలో బినామీల పేర్ల మీదకు మార్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఇదే అంశంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka).. సీనియర్ నాయకులతో మంతనాలు జరిపారు. దీనిపై రాజ్యాంగ నిపుణులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పాలనా వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం పరిధిలో ఉండగా.. ప్రస్తుత ప్రభుత్వం విధానపర, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని.. హస్తం పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఎగ్జిట్ పోల్స్‌ ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైంది : కోదండరాం

Telangana Assembly Election Results 2023 : ఇదే అంశంపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ.. ఇవాళ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోకుండా నియంత్రించాలని ఈసీని కోరనున్నట్లు తెలిపారు.

"గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల అసైన్డ్‌ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేయించేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 3వతేదీ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి భూములను ధరణిలో తప్పుగా నమోదు, రిజిస్ట్రేషన్‌లు చేసే అధికారులపై చర్యలు తప్పవు. ఇదే విషయమై ఈరోజు ఈసీకి ఫిర్యాదు చేస్తాం." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Bhatti On CM KCR : రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమచేసే ప్రక్రియను కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని భట్టి ఆక్షేపించారు. ఎన్నికల్లో భారాసకు వనరులు సమకూర్చిన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్న పాలకులు, రైతుబంధు సొమ్మును వారికి విడుదల చేయడానికి సిద్ధపడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించేలా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేయవద్దని ఆర్థికశాఖను హెచ్చరిస్తున్నామన్నారు. అధికార బదిలీ జరుగుతున్న క్రమంలో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిష న్‌ను కోరతామన్నారు. అధికారులు భారాస ఉచ్చులో పడొద్దని, సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేయవద్దని హితవు పలికారు.

వార్‌ రూం నుంచి కాంగ్రెస్‌ దిశానిర్దేశం : ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై.. వార్‌ రూం నుంచి కాంగ్రెస్‌ దిశానిర్దేశం చేసింది. గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నుంచి అందుకోగానే.. హైదరాబాద్ రప్పించే యోచనలో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తాజ్‌కృష్ణాలో వారందరితో సమావేశమై.. అధిష్ఠానం సూచనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కేటీఆర్ భయపడుతున్నారు - అందుకే వాటిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు : పొన్నం ప్రభాకర్

ఇందుకోసం ఏఐసీసీ నియమించిన రాష్ట్ర ప్రత్యేక పరిశీలకులైన దీపాదాసు మున్షి, కర్ణాటక మంత్రి బోసురాజు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తదితరులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని.. స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Congress Telangana Exit Polls 2023 : ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. పలువురు అభ్యర్థులు, నాయకులు జూబ్లీహిల్స్‌లోని పీసీసీ సారథి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చి ఆయనను కలిశారు. తమ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని తెలియజేశారు. ఎగ్జిట్‌పోల్స్‌పై చర్చించిన నేతలు అధికారం తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన అందరికీ ధన్యవాదాలు : రేవంత్ ​రెడ్డి

తెలంగాణలో ఛాలెంజ్​ ఓటు వేసిన ఒక్కమగాడు - ఎక్కడో తెలుసా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.