ETV Bharat / state

Congress Candidate List 2023 : రేపే కాంగ్రెస్​ పార్టీ 70 మంది అభ్యర్థుల తొలి జాబితా?.. 18 నుంచి బస్సు యాత్ర - తెలంగాణ కాంగ్రెస్ మొదటి​ అభ్యర్థుల జాబితా

Congress Candidate List 2023 Telangana : శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. సుమారు 70 స్థానాల్లో అభ్యర్థుల పేర్లకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. వామపక్షాలతో పొత్తు, చేరికల నేపథ్యంలో ఆరుస్థానాల్లో ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజక వర్గాల్లో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కసరత్తు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telangana Congress Candidate List 2023
Congress Candidate List 2023 Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 7:50 AM IST

Congress Candidate List 2023 Telangana రేపే కాంగ్రెస్​ పార్టీ 70 మంది అభ్యర్థుల తొలి జాబితా

Congress Candidate List 2023 Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల(Telangana Congress) బరిలో దిగే రేసుగుర్రాల తొలి జాబితా సిద్ధమైంది. వివాదాలకు తావులేని 70కిపైగా నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక(T Congress MLA Candidate List) పూర్తయింది. మంచి రోజులు ప్రారంభమవుతున్నందున తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల వడపోతకు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ దిల్లీలోని వార్‌రూంలో సమావేశమై ఖరారు చేసింది. రెండు సమావేశాల్లో ఏడు, ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపిన కమిటీ.. శుక్రవారం మాత్రం కేవలం రెండున్నర గంటల్లోనే భేటీని ముగించింది. 70 సీట్లపైనే ఎక్కువ చర్చ జరిగినట్లు తెలిసింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం, ఒక్కో నియోజకవర్గానికి రెండు, మూడు పేర్లతో కేంద్ర స్క్రీనింగ్‌ కమిటీకి జాబితా పంపారు.

సీఈసీ సమావేశంలో ఓయూ విద్యార్థుల డిమాండ్లు, ఉదయ్‌పుర్‌ డిక్లరేషన్‌, వివిధ సామాజిక వర్గాల వినతులపై చర్చించారు. 70 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆయా స్థానాల్లో గెలుపు ఖాయమనే భావన సభ్యుల్లో వ్యక్తమైంది. 43 స్థానాల్లో తీవ్ర పోటీ ఉండడంతో వాటికి అభ్యర్థుల ఖరారు బాధ్యతను సీఈసీకి.. స్క్రీనింగ్‌ కమిటీ వదిలేసింది.

Congress Alliance in Telangana : వామపక్షాలతో పొత్తు, బీఆర్​ఎస్​, బీజేపీల నుంచి ముగ్గురు ప్రముఖులు వచ్చే అవకాశముందని, వారి కోసం ఆరు సీట్లు పక్కకు పెట్టినట్లు తెలిసింది. రాష్ట్రంలో 70 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనకు జాబితా సిద్ధంగా ఉందని స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ తెలిపారు. పార్టీ విజయావకాశాలు, విధేయతను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వామపక్షాలతో చర్చలు సాగుతున్నట్లు చెప్పారు.

Telangana Congress Bus Yatra Schedule 2023 : ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర

"60 కంటే ఎక్కువ మంది అభ్యర్థులను ఫైనల్​ చేశాం. మిగిలిన స్థానాలను త్వరలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాము. పార్టీ విజయావకాశాలు, విధేయతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక జరిగింది. వామపక్షాలతో ఇంకా చర్చలు సాగుతున్నాయి. 15వ తేదీ తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది." - మురళీధరన్‌, స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌

Telangana Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ముఖ్యనేతల బస్సుయాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. రాహుల్‌, ప్రియాంక గాంధీలు మూడు రోజులపాటు యాత్రలో పాల్గొంటారు. వారిద్దరూ ఈ నెల 18న కొండగట్టుకు చేరుకుంటారు. అంజన్న దర్శనం చేసుకుని, బస్సు యాత్రను ప్రారంభించి.. కొండగట్టు నుంచి జగిత్యాల వరకు జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బస్సుయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. బస్సుయాత్రను తొలిదశలో నాలుగు రోజులపాటు సాగేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

ఈసారి కాంగ్రెస్‌ను గణనీయ స్థానాల్లో గెలిపించాలనే పట్టుదలతో పార్టీ అగ్రనేతలను రప్పిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బస్సుయాత్రలోనే మెనిఫెస్టోను రాహుల్‌, ప్రియాంకల చేతుల మీదుగా విడుదల చేయించాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభం అవుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 18న జగిత్యాలలో ప్రారంభం కానున్న బస్సుయాత్ర, రోడ్‌షోల కోసం స్థానిక కొత్తబస్టాండ్‌ చౌరస్తాను ఏఐసీసీ కార్యదర్శి సుశాంక్‌మిశ్రాతో కలిసి ఆయన పరిశీలించారు. ఆదివారం జాబితాను విడుదల చేయకుంటే.. అన్ని స్థానాలకు దసరా రోజున ప్రకటించేందుకు ఆస్కారం ఉందని సమాచారం.

Congress Candidates List in Telangana Elections 2023 : కసరత్తుల నడుమ సిద్ధమైన కాంగ్రెెస్ తొలి జాబితా.. ఎప్పుడంటే..?

Congress Foremen Committee : అసంతృప్తుల బుజ్జగింపుపై అధిష్ఠానం ఫోకస్​.. జానారెడ్డి నేతృత్వంలో ఫోర్​మెన్ కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.