రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీలను నియమించింది. రెండు నియోజకవర్గాలకు ఎన్నికల ప్రచార, సమన్వయ కర్తలతో పాటు స్టార్ క్యాంపెయినర్లనూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో ఉన్న హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల మండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచార కర్తగా ఎంపీ రేవంత్ రెడ్డి, సమన్వయ కర్తగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లను నియమించారు. నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజవర్గాలకు ఎన్నికల ఇంఛార్జీగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్లను నియమించారు.
మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ బరిలో ఉన్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి నియోజకవర్గ ప్రచారకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల సమన్వయ కర్తగా కాంగ్రెస్ ఆదివాసీ కమిటీ జాతీయ వైస్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్లను నియమించారు. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గాలకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలను ఇంఛార్జీలుగా ప్రకటించారు. స్టార్ క్యాంపెయినర్లుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను నియమించారు.
ఇదీ చూడండి: ఉద్యోగాలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: రాంచందర్ రావు