ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెదేపా మాజీ మంత్రులపై లోకయుక్తలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్‌కిరణ్ ఫిర్యాదు చేశారు. తెదేపా ఐదేళ్ల పాలనలో ఇసుక మాఫియా, రాజధాని అక్రమాలు, పోలవరం ప్రాజెక్టుల్లో చేసిన అక్రమాలు వెలుగులోకి తీసుకురావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వేలకోట్లు అక్రమంగా సంపాదించారని... ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా అవినీతి చేశారని ఆరోపించారు. ప్రజాధనాన్ని లూటీ చేసినందుకు చంద్రబాబు నాయుడు , మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి దగ్గరి నుంచి అక్రమ సంపదను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లోకయుక్త జస్టిస్ లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు ఉదయ్‌కిరణ్ తెలిపారు.
ఇవీ చూడండి: మన్మోహన్ కోసం అమెరికా నుంచి మోదీ ట్వీట్