ETV Bharat / state

మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జగ్గారెడ్డిపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు - తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు నమోదైంది. మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం హెచ్ఛార్సీలో ఫిర్యాదు చేసింది. మంత్రులపై వ్యక్తిగత దూషణలు చేసిన జగ్గారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు హెచ్ఛార్సీని కోరారు.

జగ్గారెడ్డిపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు
జగ్గారెడ్డిపై హెచ్ఛార్సీలో ఫిర్యాదు
author img

By

Published : Jul 30, 2020, 4:02 PM IST

మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేసింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును వ్యక్తిగతంగా దూషించి... తాజాగా ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను బ్రోకర్ అని మాట్లాడారని సంఘం అధ్యక్షుడు గంధం రాములు కమిషన్​కు వివరించారు.

ఒక సీనియర్ నాయకుడిగా భారత రాజ్యాంగ చట్టాలు తెలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్​పై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేయడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శ్రీనివాస్ గౌడ్​ను అసభ్య పదజాలంతో దూషించడంపై మండిపడ్డారు.

ప్రజల సంక్షేమంతో పాటు... కరోనా విపత్కర పరిస్థితుల్లో కృషి చేస్తున్న మంత్రులను తిట్టడం మానుకొని... తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న మంత్రులపై నోటికి వచ్చినట్లు వ్యక్తిగత దూషణలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గంధం రాములు హెచ్చార్సీని కోరారు.

ఇవీ చూడండి: సీఎం నియోజకవర్గంలోనే ఇంత దారుణమా: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.