కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రోజువారి కూలీలకు పనులు లేకుండా పోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కూలీల పరిస్థితి రోజు రోజుకు దినదిన గండంగా మారింది. దీంతో వీరికి సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా అంబర్‌పేట, పోచమ్మ బస్తీ వాసులతోపాటు యువకులు ముందుకు వచ్చారు.
ప్రతి రోజు 100 మంది నిరుపేద కూలీలకు వారే స్వయంగా వంటలు చేసుకొని..వాటిని ప్యాకెట్ల రూపంలో వారివద్దకే వెళ్లి అందజేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో పోచమ్మబస్తీ వాసులు కడుపునిండా అన్నం పెట్టడంపై రోజువారి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌తో ఇంటివద్దే కరోనా పరీక్షలు