ETV Bharat / state

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​తో ఇంటివద్దే కరోనా పరీక్షలు - బియోన్ సంస్థ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​కు రూపకల్పన

ఇంటివద్దే కరోనా పరీక్షలు చేసుకునేందుకు వీలుగా దేశంలోనే మొట్టమొదటి టెస్టింగ్ కిట్​ని ప్రముఖ బియోన్​ సంస్థ రూపొందించింది. నాణ్యత పరీక్షల అనంతరం మార్కెట్లోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

bione company introduced rapid corona testing kit
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​తో ఇంటివద్దే కరోనా పరీక్షలు
author img

By

Published : Apr 4, 2020, 3:18 AM IST

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బియోన్ సంస్థ ఇంటివద్దే కరోనా టెస్టులు చేసుకునే కిట్​ను తయారు చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​. రక్త పరీక్ష ద్వారా కేవలం ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలోనే ఫలితాలు తెలుసుకోవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థతో భాగస్వామ్యం ఉన్న సీఈ, ఎఫ్​డీఏ అప్రూవుడ్ ఏజెన్సీల నుంచి దీన్ని సేకరించినట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఈ కిట్​కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతించిందని, నాణ్యత పరీక్షల అనంతరం మార్కెట్లోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ టెస్టింగ్​ కిట్ ధర కేవలం రెండు నుంచి మూడు వేల రూపాయల మధ్య ఉంటుందని వెల్లడించారు. తమ వెబ్ సైట్ ద్వారా విక్రయాలు జరపనున్నట్లు తెలిపారు.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్​తో ఇంటివద్దే కరోనా పరీక్షలు

ఇదీ చూడండి: మోదీ జిమ్మిక్కులతో జీవితాలు మారవు: అసదుద్దీన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.