ETV Bharat / state

చలి కాచుకుంటున్న ఆంధ్రా.. మూగజీవులు సైతం గజగజ

cold in Alluri Sitamaraju district: ఏపీపై చలిపులి పంజా విసురుతోంది. చలిగాలులు, మంచు కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు. అల్లూరి జిల్లాలో గత నాలుగు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.

cold
చలి
author img

By

Published : Jan 11, 2023, 12:30 PM IST

ఏపీలో చలి తీవ్రత పెరగడంతో వణుకుతున్న మన్యం ప్రజలు

Cold Increased In Alluri Sitamaraju District: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో చలిగాలుల ప్రభావంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిమంటలతో తాత్కాలికంగా సేద తీరుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి శీతలమయమైంది. చలి కారణంగా ఉదయం 9 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.

చింతపల్లి, మినుములూరులో 7 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. చలి పెరగడంతో ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. మూగజీవాలు సైతం చలిమంటలు వద్ద సేద తీరుతున్నాయి. ఉన్ని దుస్తులు వేసుకుంటే గాని బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.