ETV Bharat / state

సీఎంఆర్​ఎఫ్ పేరిట నకిలీ చెక్కులు - ఏపీలో సీఎంఆర్​ఎఫ్ పేరిట నకిలీ చెక్కులు

ఏపీ సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్ల మేర కొల్లగొట్టేందుకు దుండగులు చేసిన ప్రయత్నాలకు బ్యాంకుల అప్రమత్తతో అడ్డుకట్ట పడింది. దిల్లీ, బెంగుళూరు, కోల్​కతా ఎస్​బీఐ బ్రాంచ్​ల ద్వారా చెక్కులు మార్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

cmrf-fake-cheques-issue-in-ap
సీఎంఆర్​ఎఫ్ పేరిట నకిలీ చెక్కులు
author img

By

Published : Sep 20, 2020, 10:56 AM IST

ఏపీ సీఎం సహాయనిధి పేరుతో రూ.112 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భారీ కుట్రకు తెరలేపారు. నకిలీ సీఎంఆర్​ఎఫ్ చెక్కుల ద్వారా ఈ మొత్తాన్ని నగదుగా మార్చేందుకు యత్నించగా.. బ్యాంకు అధికారుల అప్రమత్తతతో ఆగింది. దిల్లీ, బెంగళూరు, కోల్​కతాలోని ఎస్​బీఐ శాఖల్లో నకిలీ చెక్కుల ద్వారా నగదు మార్చుకునేందుకు కొందరు ప్రయత్నించారు.

కర్ణాటకలోని మంగళూరు ఎస్​బీఐ మూడ్​బద్రి శాఖలో రూ. 52.65 కోట్లకు ఒక చెక్కు, దిల్లీలోని సీసీపీసీఐ శాఖ ద్వారా రూ.39.85 కోట్లకు ఒక చెక్కు కోల్​కతా సర్కిల్ లోని మోగ్​రాహత్ శాఖలో రూ. 24.55 కోట్ల చెక్కును నగదుగా మార్చుకునేందుకు సమర్పించారు. చెక్కులపై ఉన్న వివరాల ఆధారంగా వాటిని ధ్రువీకరించుకోడానికి బ్యాంకుల అధికారులు వెలగపూడి ఎస్​బీఐని సంప్రదించారు. దీంతో ఈ నకిలీ చెక్కుల వ్యవహారం బయటపడింది.

ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు శిక్షణ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.