ETV Bharat / state

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను: రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Visits KCR At Yashoda Hospital : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యశోద ఆసుపత్రిలో కేసీఆర్​ను పరామర్శించారు. రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు మంత్రులు యశోదకు వచ్చారు. కేసీఆర్​ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

CM Revanth Reddy Meet KCR
CM Revanth Reddy Visits KCR At Yashoda Hospital
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 12:44 PM IST

Updated : Dec 10, 2023, 8:01 PM IST

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను: రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Visits KCR At Yashoda Hospital : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌(KCR)ను పరామర్శించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని యశోదా ఆసుపత్రి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని రేవంత్‌ రెడ్(Revanth Reddy)డి ఆకాంక్షించారు. కొన్ని రోజుల్లో జరిగే శాసనసభా సమావేశాల్లో పాల్గొనాలని కోరుకున్నారు. సమస్యలపై కేసీఆర్ శాసనసభా వేదికగా గళమెత్తాలని కొత్త ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్​రెడ్డి - మహాలక్ష్మి పథకం ప్రారంభం

CM Revanth Reddy Meet KCR : యశోదా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క(Seethakka) కూడా వెళ్లారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, షబ్బీర్ అలీ, ప్లానింగ్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌లు కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, తొందరలోనే కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

'కేసీఆర్‌ను పరామర్శించాను, ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్‌ వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించా. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరాను. మంచి ప్రభుత్వం అందించడానికి కేసీఆర్‌ సూచనలు అవసరం ఉంది. ప్రజల పక్షాన కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరముంది. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరాను.' -రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

KCR Treatment at Yashoda Hospital : ప్రమాదవశాత్తు జారి కిందపడి గాయాలుపాలై చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోదండ రెడ్డి, వి.హనుమంతురావులు పరామర్శించారు. కాంగ్రెస్‌ నేతలను మంత్రి కేటీఆర్‌(KTR) దగ్గరుండి ఆస్పత్రిలోనికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా కేసీఆర్‌ కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు నాయకులు ఆకాంక్షించారు.

ఇదీ జరిగింది : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి జారిపడటంతో ఎడమ తుంటి ఎముక విరిగింది. ఆయనకు తెల్లవారుజామున సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. పరీక్ష చేసిన వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం విజయవంతంగా ఆపరేషన్‌ పూర్తి చేశారు. సీనియర్‌ వైద్యుల బృందం ప్రత్యేక పర్యవేక్షణలో దాదాపు నాలుగు గంటలకు పైగా ఈ సర్జరీ జరిగింది.

బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్‌ను అందించిన రేవంత్‌రెడ్డి

ప్రధాని మోదీ సహా పలు రాజకీయ పక్షాల నాయకులు కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీని యశోద ఆసుపత్రికి పంపి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వాకబు చేశారు. ఆయనకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ముఖ్యమంత్రి సూచించారు. అటు శస్త్రచికిత్స అనంతరం కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని, అంతవరకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ పరామర్శించారు.

ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితమే- మహిళలంతా మస్త్​ ఖుష్

Last Updated : Dec 10, 2023, 8:01 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.