CM Revanth Reddy Fires on BRS Party : రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బాధలో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని, కుంగుబాటు లక్షణాలతో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజావాణిలో(Prajavani Program) దరఖాస్తు చేసిన మహిళకు కేటీఆర్ లక్ష రూపాయలు ఇవ్వడం సంతోషకరమేనన్నారు. కేటీఆర్ కూడబెట్టుకున్న లక్ష కోట్ల రూపాయల్లో లక్ష రూపాయలే ఇచ్చారని, మిగతా సొమ్ము కూడా పంచిపెట్టే పరిస్థితి కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం
ప్రజల రక్తమాంసాలు పిప్పి చేసి సంపాదించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్థిక పరిస్థితిని అసెంబ్లీ ముందుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రోజంతా సమయం ఇస్తే చెప్పకుండా, ఇంటికెళ్లి కొత్త దుకాణం తెరిచారని విమర్శించారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారని ఆక్షేపించారు. ఇప్పటికే వందల వాహనాలు ఉండగా, కేసీఆర్ హయాంలో 22 ఖరీదైన కొత్త ల్యాండ్ క్రూయిజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని ఆరోపించారు.
CM Revanth Reddy Comments on KTR :మూడోసారి అధికారంలోకి వస్తే వాడుకుందామనుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వం సంపాదించిన ఆస్తుల తీరు ఇలా ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీలోనూ కేటీఆర్, హరీశ్‌రావు(Harish Rao) తాపత్రయమే కనిపించింది కానీ, వారితో ఒక్కరు కూడా కలిసి రాలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఖజనాను గత ప్రభుత్వం పూర్తిగా తుడిచి పెట్టిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.6.71 లక్షల కోట్లు అప్పులు చేసి అందరూ పరారయ్యారని ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై(Kaleshwaram Project) అతి త్వరలో విచారణకు ఆదేశిస్తామని, దానికి బాధ్యులెవరో తేలుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లపై కూడా విచారణ జరుపుతామని, రెవిన్యూ రికవరీ చట్టం అమలు కూడా ఉంటుందని తెలిపారు.
కొత్త ఏడాదిలో నామినేటెడ్ పోస్టులు - అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసినవారికి ప్రాధాన్యం
గత ప్రభుత్వం మార్చి వరకు రైతుబంధు సొమ్ము వేసిందని, తాము ఈనెల తొమ్మిదనే వేశామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాక ముందే హరీశ్‌రావు, కేటీఆర్ అదికాలేదు, ఇది కాలేదంటున్నారని అన్నారు. వరంగల్‌కు కేటాయించిన సైనిక్ స్కూల్ అర్థాంతరంగా ఎందుకు ఆగిపోయిందో అప్పటి సీఎంను అడగని బోయినపల్లి వినోద్ కుమార్ బుల్లెట్ రైలుపై తమకు నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.
త్వరలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన : మంత్రి ఉత్తమ్‌కుమార్