ETV Bharat / state

CM KCR: మూడురోజులు దిల్లీలోనే కేసీఆర్... రేపే పయనం.. అందుకేనా?

author img

By

Published : Aug 31, 2021, 4:49 AM IST

Updated : Aug 31, 2021, 7:05 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ రేపు దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీలో ఈ సెప్టెంబర్​ 2న తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు.

cm-kcr-to-visit-delhi-for-three-days-from-tomorrow

ముఖ్యమంత్రి కేసీఆర్​ బుధవారం నుంచి మూడు రోజుల పాటు దేశ రాజధాని దిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్​ 1న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్తారు. 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు దిల్లీ వసంత్​విహార్​ మెట్రోస్టేషన్​ సమీపంలోని 1300గజాల స్థలంలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు.

ఈ కార్యక్రమంలో తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి దిల్లీలోనే బస చేస్తారు. అనుమతి లభిస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. సెప్టెంబర్​ 3న తిరిగి హైదరాబాద్​కు వస్తారు.

ఇదీ చదవండి: IAS transfer: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు

Last Updated : Aug 31, 2021, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.