పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మిల్లింగ్ సామర్థ్యం పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇతర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్తగా పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: cm kcr: ధాన్యాగారంగా తెలంగాణ.. వ్యవసాయంపై మంత్రివర్గ ఉపసంఘం