ETV Bharat / state

CM KCR Review : రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష - కేసీఆర్ తాజా సమీక్ష

CM KCR
CM KCR
author img

By

Published : May 13, 2023, 1:56 PM IST

Updated : May 13, 2023, 2:13 PM IST

13:20 May 13

CM KCR Review : రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష

CM KCR Review on TS Formation Day Celebrations : పదేళ్ల తెలంగాణ వేడుకల నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు చేసిన కసరత్తును సీఎం సమీక్షలో చర్చిస్తున్నారు. ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఎప్పట్నుంచి నిర్వహించాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, బహిరంగసభ తదితర అంశాలపై సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు పదేళ్ల తెలంగాణ వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో వారం రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. అమరుల త్యాగాలు స్మరించుకోవడం సహా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా కార్యక్రమాలు ఉండేలా చూస్తున్నారు. సంబంధిత అంశాలపై అన్ని శాఖల కార్యదర్శులతోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. అదే విధంగా బ్రాహ్మణ పరిషత్ సదనము ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 13, 2023, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.