నీటిపారుదల శాఖ బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. వార్షిక బడ్జెట్ కసరత్తులో భాగంగా గురువారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం... శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి... బడ్జెట్ సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, ఇతర అంశాలపై సమీక్షిస్తున్నారు. సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు నిధుల విషయమై సీఎం గతంలోనే అధికారులు, ఇంజినీర్లతో చర్చించారు.
ఇదీ చదవండి: ఎంసెట్‌లో 'ఇంటర్ వెయిటేజీ' కొనసాగించాలా? వద్దా?