CM KCR reached hyderabad: వారం రోజుల దిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దిల్లీలో పలువురు విపక్షాల నేతలను సీఎం కలిశారు. ఈనెల 25న ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, జి.రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తెరాస ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఉన్నారు.
అఖిలేశ్‌తో కీలక భేటీ: యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై ఆయనతో చర్చించారు. ఇతర రాష్ట్రాల నేతలతో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు అఖిలేశ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్న భాజపాపై సమష్టిగా పోరాడేందుకు కలిసి రావాలని అఖిలేశ్‌ను కోరినట్లు సమాచారం.
ఇవీ చదవండి: 104 కారిడార్లు.. రూ.2400 కోట్ల వ్యయం.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
'ద్వితీయ శ్రేణి పౌరులుగా మైనారిటీలు! అలా చేస్తే దేశ విభజన ముప్పు!'