ETV Bharat / state

అధ్యాపకుడితో ఫోన్​లో మాట్లాడిన సీఎం కేసీఆర్​ - hyderabad latest news

విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్.. ఇద్దరు ప్రభుత్వ అధ్యాపకులను ప్రశంసించారు. విద్యాబోధనకే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో సేవలందిస్తున్న వారి సేవలను కొనియాడారు.

cm kcr phone call with lecturer sadashivaiah
అధ్యాపకుడితో ఫోన్​లో మాట్లాడిన సీఎం కేసీఆర్​
author img

By

Published : Jul 16, 2020, 10:44 PM IST

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రధానోపాధ్యాయుడు పీర్ మహ్మద్ షేక్ సేవలను సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని తెలుసుకున్న సీఎం.. వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో కేసీఆర్‌ ఫోన్లో మాట్లాడారు. సదాశివయ్య కృషిని టీవీల్లో స్వయంగా చూశానని.. సీఎం కేసీఆర్ వెల్లడించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందని.. పాలమూరు వర్సిటీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలని సదాశివయ్యకు సీఎం సూచించారు.

అధ్యాపకుడితో ఫోన్​లో మాట్లాడిన సీఎం కేసీఆర్​

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.