కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా ఆయన్ను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. బాపూజీ ఎందరికో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.
క్విట్ ఇండియా, ముల్కీ వ్యతిరేక ఉద్యమాల్లోనూ కొండ లక్ష్మణ్ బాపూజీ పాల్గొన్నారని చెప్పారు. ఆయన పోరాటాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆయన సేవలను ఎన్నటికీ మర్చిపోదన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1302 కరోనా కేసులు.. 9 మంది మృతి