సీఏఏకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేశద్రోహి, పాకిస్థాన్ ఏజెంట్ అని విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, తప్పు చేస్తే దేశం తమను తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఉండాల్సిందేనని, చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరని సీఎం పేర్కొన్నారు. మెక్సిక్ వాసులు రాకుండా అమెరికా గోడ కట్టిందని, భారత్లో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా అని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా తమ తీర్మానాన్ని ప్రజలు ఆమోదిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం