జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు దక్కించుకున్న గ్రామ, మండల, జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. హైదరాబాద్ ప్రగతిభవన్లో జరిగిన కార్యక్రమంలో మెదక్ జడ్పీ ఛైర్పర్సన్, కోరుట్ల, ధర్మారం ఎంపీపీలు, ఆయా గ్రామపంచాయతీల సర్పంచులను సీఎం అభినందించారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు.
ఇదీ చూడండి: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కష్ట ఫలితమే అవార్డులు: ఎర్రబెల్లి