CM KCR Announced Sunitha Lakshmareddy as Narsapur Candidate : రాష్ట్రంలో బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆమెకు సీఎం కేసీఆర్ బీ ఫామ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అందరూ కలసి కట్టుగా ఉంటూ బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలన్నారు.
ఈమేరకు ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యే(Narsapur MLA Candidate)గా కొనసాగుతున్న మదన్‌రెడ్డికి.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ.. అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏకగ్రీవంగా బీఆర్ఎస్లో కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
CM KCR Gave B Form to Ex Minister Sunitha Lakshma Reddy : ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. మదన్ రెడ్డి తనతో పాటు మొదటి నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకులు. 35 ఏళ్ల నుంచి తనతో అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్న నేత అని కొనియాడారు. మదన్ రెడ్డి కేసీఆర్‌కు కుడి భుజం లాంటి వారని అన్నారు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజాలపై వేసుకొని.. సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుంచి మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. వారి సీనియారిటీని పార్టీ గుర్తించి.. గౌరవించినందుకు పార్టీ ముఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నానని చెప్పారు.
Telangana Assembly Election 2023 : మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మదన్ రెడ్డి ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకే ఆయన కేవలం నర్సాపూర్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఉండాలని అన్నారు. అందుకే ఆయన సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాలని అనుకుంటుందన్నారు. తనతో పాటు కలసి సునీత లక్ష్మారెడ్డికి బీం ఫామ్ ఇవ్వడం సంతోషం కలిగించిందని హర్షించారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడంతో మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్ఠను కాపాడుతున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.