ముస్లిం సోదరులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. ఇస్లాం సంప్రదాయంలో బక్రీద్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని గవర్నర్ వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. ఒకవేళ మసీదులకు వెళ్తే అక్కడ భౌతిక దూరం పాటించాలని సీఎం సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. కొవిడ్ సమయంలో సాటివారిపై దయ, కరుణ చూపాలని సీఎం కోరారు.
ఇదీ చూడండి: భారత్కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి