ETV Bharat / state

బిల్లులోని ఆ మూడు అంశాలను స్వాగతిస్తున్నాం: భట్టి - CLP Leader Bhatti Vikramarka Speech

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జీహెచ్​ఎంసీ చట్టసవరణ బిల్లును కేటీఆర్​ ప్రవేశపెట్టగా... అందులో పొందు పరిచిన 3 అంశాలను స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

CLP leader Bhatti Vikramarka talk about GHMC Amendment in assembly sessions 2020
బిల్లులో పొందుపరిచిన 3 అంశాలను స్వాగతిస్తున్నాం: భట్టి
author img

By

Published : Oct 13, 2020, 12:28 PM IST

జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లులో పొందుపరిచిన 3 అంశాలను స్వాగతిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. పచ్చదనం పెంపునకు బడ్జెట్ పెంపు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

రిజర్వేషన్ల ప్రక్రియను 2 టర్మ్‌లకు వర్తింపు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. సమగ్ర సర్వే ప్రకారం రాష్ట్రంలో 52 శాతం బీసీలు ఉన్నారని స్పష్టం చేశారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: గ్రామాల్లో ధరణికి డబుల్ ట్రబుల్.. తలలు పట్టుకుంటున్న అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.