ETV Bharat / state

'ఉన్నత విద్యపై సీఎం కేసీఆర్​ అధికార దుర్వినియోగం' - కొత్త ప్రైవేటు విశ్వవిద్యాలయాలపై భట్టి ధ్వజం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వార్థంతో ఆయనకు ఆర్థిక వనరులు సమకూర్చే వారికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కట్టబెట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు.

clp leader bhatti vikramarka comments on kcr Abuse of power over higher education in telangana
'ఉన్నత విద్యపై సీఎం కేసీఆర్​ అధికార దుర్వినియోగం'
author img

By

Published : May 25, 2020, 5:30 PM IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ ఉన్నత విద్యను బజారులో పెట్టి అమ్ముతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రి మాల్లారెడ్డికి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు విశ్వవిద్యాలయాలు ఇవ్వడం అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని భట్టి అన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్న విద్యాలయాలను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగావకాశాలు కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఓ యూనివర్సిటీ కేటాయించి ఉన్నత విద్యను ప్రోత్సహించామని చెప్పారు. ఇప్పుడేమో సీఎం కేసీఆర్‌ పేద విద్యార్థులు చదువుకోవడం ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

'ఉన్నత విద్యపై సీఎం కేసీఆర్​ అధికార దుర్వినియోగం'

ఇదీ చూడండి : ఆస్పత్రిలో వైద్యుల కొరతతో.. రోగుల ఇబ్బందులు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.