రాష్ట్రంలో పోలీసుల ఆగడాలు పెరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. భువనగిరిలోని పోలీస్ స్టేషన్‌లో జరిగిన మహిళా లాకప్ డెత్‌పై విచారణ జరిపి... బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాత్రి 11 గంటలకు మహిళా కానిస్టేబుల్ లేకుండా ఒక మహిళను ఠాణాకు ఎలా తీసుకువెళ్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అన్యాయాలపై యావత్ భారత జాతిని ఏకం చేసే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా భాజపా ముందుకెళుతోందని విమర్శించారు. యువతలో ఆత్మస్థైర్యం నింపే బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టి దేశానికి మార్గదర్శకుడిగా నిలువాలని జీవన్ రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: ఇద్దరు పిల్లల విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం