ETV Bharat / state

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నగర మేయర్​ - బాలాన‌గ‌ర్

హైదరాబాద్​లోని బాలాన‌గ‌ర్ పైవంతెన నిర్మాణానికి సంబంధించి ఆస్తుల సేకరణపై జీహెచ్​ఎంసీ కార్యాలయంలో మేయర్​ బొంతు రామ్మోహన్​ సమీక్ష నిర్వహించారు.

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నగర మేయర్​
author img

By

Published : Nov 4, 2019, 9:01 PM IST

హైదరాబాద్​లోని బాలాన‌గ‌ర్ పైవంతెన నిర్మాణానికి భూ, ఆస్తుల సేక‌ర‌ణ ప్రక్రియ‌ను వేగవంతం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఆస్తుల సేకరణపై జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. సమావేశంలో కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, స్థానిక కార్పొరేట‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్ మ‌మ‌త‌, చీఫ్ సిటీ ప్లాన‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్‌, భూసేక‌ర‌ణ అధికారులు, ఆస్తులు కోల్పోనున్న య‌జ‌మానులు పాల్గొన్నారు. బాలాన‌గ‌ర్ పైవంతెన నిర్మాణంలో మొత్తం 367 ఆస్తులకు గానూ... ఇప్పటికే 120 ఆస్తుల‌కు సంబంధించి ఆమోదం ల‌భించింద‌ని... మ‌రో 76 ఆస్తులు ప్రభుత్వ విభాగాల‌కు సంబంధించిన‌వి ఉన్నాయ‌ని... మిగిలిన 170 ఆస్తుల‌కు సంబంధించి భూసేక‌ర‌ణ చ‌ట్టం కింద డిక్లరేష‌న్ దాఖ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ వంతెన నిర్మాణంతో సికింద్రాబాద్, కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్, కుత్బుల్లాపూర్‌, గాజుల రామారం, సుచిత్ర మార్గాల్లో సిగ్నల్ ఫ్రీ ర‌వాణా సౌక‌ర్యం ఏర్పడుతుంద‌ని మేయర్​ స్పష్టం చేశారు.

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన నగర మేయర్​

ఇదీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ

TG_HYD_39_04_Ghmc_Mayor_Review_AV_3182301 నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ Reporter: Kartheek () హైదరాబాద్ నగరంలోని బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి భూ, ఆస్తుల సేక‌ర‌ణ ప్రక్రియ‌ను వేగవంతం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రూ. 387 కోట్లతో బాలాన‌గ‌ర్ క్రాస్ రోడ్ నుంచి న‌ర్సాపూర్ క్రాస్ రోడ్ వ‌ర‌కు ఈ ప్రతిపాదిత ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి 367 ఆస్తుల‌ను సేక‌రించాల్సి ఉంది. ఆస్తుల సేక‌ర‌ణ‌పై మేయ‌ర్ రామ్మోహ‌న్ జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, స్థానిక కార్పొరేట‌ర్లు, జోన‌ల్ క‌మిష‌న‌ర్ మ‌మ‌త‌, చీఫ్ సిటీ ప్లాన‌ర్ దేవేంద‌ర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్‌, భూసేక‌ర‌ణ అధికారులు, ఆస్తులు కోల్పోనున్న య‌జ‌మానులు హాజరయ్యారు. సమావేశంలో ఆస్తుల య‌జ‌మానులు తమ ఆస్తుల‌ను జీహెచ్ఎంసీకి అప్పగించేందుకు అంగీకారాన్ని వ్యక్తం చేశారు. బాలాన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణంతో మొత్తం 367 ఆస్తులకు ఇప్పటికే 120 ఆస్తుల‌కు సంబందించి ఆమోదం ల‌భించింద‌ని... మ‌రో 76 ఆస్తులు ప్రభుత్వ విభాగాల‌కు సంబంధించిన‌వి ఉన్నాయ‌ని మేయర్ పేర్కొన్నారు. మిగిలిన 170 ఆస్తుల‌కు సంబంధించి భూసేక‌ర‌ణ చ‌ట్టం కింద డిక్లరేష‌న్ దాఖ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి రూ. 387 కోట్ల రూపాయ‌లు కేటాయించ‌గా దీనిలో రూ. 265 కోట్లు భూసేక‌ర‌ణ‌, ఆస్తుల సేక‌ర‌ణ‌కు కేటాయించ‌డం జ‌రిగింద‌ని, రూ. 122 కోట్లు ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి అవుతుంద‌ని తెలిపారు. ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణంతో సికింద్రాబాద్, కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్, కుత్బుల్లాపూర్‌, గాజుల రామారం, సుచిత్ర మార్గాల్లో సిగ్నల్ ఫ్రీ ర‌వాణా సౌక‌ర్యం ఏర్పడుతుంద‌ని స్పష్టం చేశారు. ఎండ్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.