ETV Bharat / state

MLC Ashok Babu Arrest : అశోక్‌బాబు అరెస్ట్‌పై తెదేపా నేతల ఆందోళన..పలువురు అరెస్ట్​ - టీడీపీ ఎమ్మెల్సీ అశోక్​బాబు అరెస్ట్​

MLC Ashok Babu Arrest: తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఖండించారు. ఏపీ సీఎం జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినందునే.. అందరినీ పంపాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన పలువురు తెదేపా నేతలకు పోలీసులు అరెస్ట్​ చేశారు.

MLC Ashok Babu Arrest
అశోక్​బాబు అరెస్టును ఖండించిన తెదేపా నేతలు
author img

By

Published : Feb 11, 2022, 7:14 AM IST

Updated : Feb 11, 2022, 11:59 AM IST

Chandrababu on Ashok babu arrest: ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. సర్వీస్ మేటర్స్​లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని చంద్రబాబు దుయ్యబట్టారు. జ‌గన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

పార్టీ అండగా ఉంటుంది: లోకేశ్​

Lokesh on Ashok babu Arrest: అర్ధరాత్రి అక్రమంగా అశోక్ బాబును అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేశ్​ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం అశోక్ బాబు పోరాడుతున్నందుకే ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. పార్టీ... అశోక్ బాబుకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

MLC Ashok Babu Arrest
అశోక్‌బాబు అరెస్ట్‌పై తెదేపా నేతల ఆందోళన

అశోక్ బాబు న్యాయవాదులను అడ్డుకున్న పోలీసులు

ఎమ్మెల్సీ అశోక్ బాబు తరఫు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయం వద్దకు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐడీ అధికారులు చెబితేనే కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

అశోక్​బాబు అరెస్ట్​ సమాచారం తెలుసుకుని పలువురు తెదేపా నేతలు గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్దకు వచ్చారు. సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అశోక్​బాబును కలుసుకునేందుకు దేవినేని ఉమతో పాటు పలువురు తెదేపా నేతలు రాగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉమతో పాటు.. తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చిరాం ప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తిలను అరెస్ట్​ చేశారు. అశోక్​బాబుపై సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెదేపా నేతలు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ రఘురామకృష్ణరాజుని కూడా కొట్టారన్న నేతలు.. అందుకే అశోక్​బాబును చూపించాలి డిమాండ్​ చేశారు.

'అర్ధరాత్రి దొంగల్లా అరెస్ట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది?'

అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన సీఎం జగన్ .. అరాచకంతో పాలన సాగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్​బాబు, ఆలపాటి రాజా, సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. వైకాపా వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన తెదేపా నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో ‎వేధిస్తున్నారని మండిపడ్డారు. అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయటాన్ని ఖడిస్తున్నట్లు తెలిపిన నేతలు.. అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. గతంలో అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. వైకాపా ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై ఉద్యోగుల్ని చైతన్యంవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు భయపడేవారెవరూ తెదేపాలో లేరని... అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి ఇకనైనా పద్ధతి మార్చుకుని పాలన సాగించకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఖండించారు. రాష్ట్రంలో ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడం వల్లే ఎమ్మెల్సీ అశోక్ బాబును ప్రభుత్వం అరెస్టు చేయించిందని మండిపడ్డారు. అక్రమ కేసులతో కాపుల గొంతునొక్కాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు.

చీకటి ప్రభుత్వం అన్నీ చీకట్లోనే చేస్తుంటుంది: పట్టాభి

ఉద్యోగుల పక్షాన మాట్లాడటమే అశోక్‌బాబు చేసిన నేరమా? అని పట్టాభిరాం.. వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అరెస్టుల పర్వం మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి అశోక్‌బాబును అరెస్టు చేస్తారా? అని ప్రశ్చించిన ఆయన.. చీకటి ప్రభుత్వం అన్నీ చీకట్లోనే చేస్తుందని ఎద్దేవా చేశారు. జనవరి 25కు, ఫిబ్రవరి 10కి అదనంగా 4 సెక్షన్లు ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ జరిగింది..

MLC Ashok Babu Arrested: ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

దీనిపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త... సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా.. గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులోనే అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అశోక్ బాబు అరెస్టు పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : CEO Shashank Goyal: సీఈవో శశాంక్​ గోయల్​ను రిలీవ్​ చేసేందుకు ఈసీ అనుమతి

Last Updated : Feb 11, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.