ETV Bharat / state

మీకు తెలుసా... చాక్లెట్​ని అందానికీ ఉపయోగించవచ్చు! - తెలంగాణ వార్తలు

చాక్లెట్‌ని చూస్తే చాలు మనలో చాలామందికి నోరూరుతుంది. దీన్ని అందానికీ ఉపయోగించవచ్చు. అదెలాగో.. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...!

మీకు తెలుసా... చాక్లెట్​ని అందానికీ ఉపయోగించవచ్చు!
author img

By

Published : Feb 6, 2021, 1:34 PM IST

చాక్లెట్​ తింటే రుచినిస్తుంది. అంతేకాదు దీన్ని అందానికీ ఉపయోగించవచ్చు. ఎలాగంటే... చాక్లెట్‌ను కరిగించి దానికి చెంచా తేనె, కొద్దిగా పాలపొడి కలిపి పేస్టులా చేయాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పూతలా వేసుకుని పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. కనీసం పదిహేను రోజులకోసారైనా ఇలా చేస్తుంటే దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

chocolate-usage-and-beauty-tips-with-chocolate
చాక్లెట్​తో మీ అందానికి మరింత మెరుగు...
  • కొందరి చర్మం ముడతలు పడి అసలు వయసు కంటే ఎక్కువున్నట్లు కనిపించేలా చేస్తుంది. చాక్లెట్‌ని కరిగించి దాంట్లో రెండు చుక్కల లావెండర్‌ నూనె వేసి గిలకొట్టాలి. ఆపై చెంచా పెసరపిండి చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. దీనివల్ల చర్మానికి తగిన రక్తప్రసరణ జరిగి చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
  • చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు చాక్లెట్‌పొడిలో తగినంత రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే మంచిది. చర్మం బిగుతుగా మారాలంటే.. చాక్లెట్‌పొడికి గుడ్డు తెల్లసొన చేర్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరాక కడిగేయాలి.

ఇదీ చదవండి: ఖమ్మంలో ప్రజాస్వామ్యం ఖూనీ: సీఎల్పీ నేత భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.