ETV Bharat / state

Chikoti Praveen Update : క్యాసినో కేసులో ముగిసిన చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణ - హైదరాబాద్ తాజా వార్తలు

Chikoti Praveen ED Investigation Concluded : ఇటీవల థాయిలాండ్‌లో అక్రమంగా క్యాసినో నిర్వహించిన కేసులో పట్టుబడ్డ గ్యాంబ్లర్‌ చీకోటి ప్రవీణ్‌ను నేడు ఈడీ విచారించింది. ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీపై సమాచారం రాబట్టేందుకు విచారణకు హాజరుకావాలని చీకోటి ప్రవీణ్​తో పాటు మరికొంత మందికి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ చీకోటి విచారణకు హాజరయ్యారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీపై ఆయనను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

Chikoti Praveen Update
Chikoti Praveen Update
author img

By

Published : May 15, 2023, 8:56 PM IST

Chikoti Praveen ED Investigation Concluded : క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్​కు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) మరోమారు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసుల్లో మే 15న (ఈరోజు) హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు ఇవాళ చీకోటి ప్రవీణ్​ విచారణకు హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు ఈడీ చీకోటిని విచారించింది. థాయ్​లాండ్​ క్యాసినో కేసు తర్వాత చీకోటి సహా పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీపై ఆయనను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది.

క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై గతంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం విధితమే. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు చీకోటిని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా థాయ్‌లాండ్‌ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేశారు. చీకోటితో పాటు ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తున్న చిట్టి దేవేందర్‌, మాధవరెడ్డి, సంపత్‌కు కూడా ఈ ఈడీ నోటీసులు ఇచ్చారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో సంపత్‌ గతంలో విచారణకు హాజరయ్యారు. మిగతా ముగ్గురు కూడా హాజరుకావాల్సిందిగా ఈడీ నోటీసులలో తెలిపింది.

ఇది జరిగింది: క్యాసినో కేసులో థాయ్​లాండ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, అతని అనుచరులతో పాటు.. క్యాసినో ఆడేందుకు వెళ్లిన వారిని థాయ్​లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే క్రెడిట్స్​ను అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్​లాండ్​లోని కోన్ బురి జిల్లా బ్యాంగ్ లా ముంగ్​లో ఉన్న ఓ కన్వెన్షన్ హాల్​లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

ఈ మేరకు కోన్ బురి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కాంపోల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.రూ.లక్షా 60 వేలు నగదు, 92 చరవాణిలు, ఒక ఐపాడ్​తో పాటు.. మూడు ల్యాప్​ టాప్​లు, 25 సెట్ల ప్లే కార్డులు, సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, చీకోటి ప్రవీణ్ అనుచరుడు మాధవరెడ్డితో పాటు పలువురు తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

అనుమతి లేకుండా క్యాసినో నిర్వహిస్తున్నట్లు థాయ్​లాండ్ పోలీసులు తెలిపారు. చీకోటి ప్రవీణ్​పై ఇప్పటికే హైదరాబాద్ ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోవాలో బిగ్ డాడీ, క్యాసినో పలు రకాల పేకాటలు నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్.. ఆ తర్వాత శ్రీలంక, నేపాల్, థాయ్​లాండ్​లోనూ క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.