హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు బాబానగర్ చెరువుకట్ట తెగిపోయింది. దీంతో పాతబస్తీలోని డబీర్‌పురాలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపునకు గురవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
పలు చోట్ల నాలాల మరమ్మత్తు పనులు చేస్తుండడం సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. వరద నీరు దిగువకు వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతోంది. రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.