ETV Bharat / state

గాంధీలో వైద్యులకు రక్షణ లేదు: చెరుకు సుధాకర్

గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి హేయమైన చర్య అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యులకు రక్షణ చర్యలు కల్పించాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 11, 2020, 4:31 PM IST

cheruku-sudhakar-comments-on-gandhi-hospital-doctors-attacked
'ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు.. కరోనా కట్టడికి నిర్లక్ష్యం'

గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఖండించారు. గాంధీ ఆస్పత్రికి చేరుకుని వైద్యుల నిరసనకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం కరోనా టెస్టులు నిర్వహించడం లేదని, వైద్యులకు రక్షణ కరువైందని ఆయన అన్నారు. వైద్యుల రక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నా.. కరోనా మహమ్మారి కట్టడికి మాత్రం ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యుల పట్ల దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. చనిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు చెప్పినప్పటికీ ఆరోగ్యశాఖ మంత్రి పరీక్షలు చేయడం అశాస్త్రీయం అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గాంధీలో వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

ఇదీ చూడండి : గాంధీలో కొవిడ్-19 బాధితుని మృతదేహం అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.