దిశ ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే నగర శివారుల్లోని చీకటిగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ దీపాల వెళుతురును పెంచుతున్నారు. అందులో భాగంగానే ప్రధానంగా ఔటర్‌రింగ్ రోడ్డు వద్ద ఉన్న అండర్ పాస్‌ల వద్ద భారీగా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం నగర శివారుల్లోని 165 అండర్ పాస్‌ల వద్ద విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసినట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రజలు రోడ్లు దాటే ప్రదేశాలతోపాటు అండర్ పాస్‌ల వద్ద సోలార్ విద్యుత్ దీపాలను పూర్తి చేశారు. వాటిని ఈనెల 3న ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ అధికారులను అభినందించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ద్వారా ట్విట్ చేశారు.
ఇదీ చూడండి : కేటీఆర్ పర్యటనకు ఫ్లెక్సీలు.. రూ. లక్ష జరిమానాకు మంత్రి ఆదేశం