ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో సోమవారం తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలను నిరసిస్తూ... ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. కుప్పం ప్రజల సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు... పార్టీ జిల్లా నేతలు ఆందోళన చేశారన్నారు.
ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వం బాధ్యత అన్న ఆయన.. సర్కారుకి వేరే ఇతర ప్రాధాన్యాంశాలు ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అక్రమ నిర్బంధాలకు గురైన వ్యక్తులను బేషరతుగా విడుదల చేయాలని లేఖలో కోరారు. ప్రజాస్వామ్య విస్తృత ప్రయోజనాలను కాపాడాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: దుబ్బాకలో పోలీసులది పక్షపాత వైఖరి: దాసోజు శ్రవణ్